ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
KMM: ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్ సీళ్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును స్వయంగా తనిఖీ చేసిన ఆయన, భద్రతా సిబ్బంది విధుల్లో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు.