నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం: కలెక్టర్
WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, సకాలంలో సీఎంఆర్ ధాన్యం సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు వేగంగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నగదు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా జమ చేసేలా చూడాలని ఆయన తెలిపారు.