ఈ ఊరిలో తీసిన చిత్రాలెన్నో!

ఈ ఊరిలో తీసిన చిత్రాలెన్నో!

MDK: చేగుంట మండలం చందాయిపేట గ్రామం సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి పెంకుటిళ్లు, బురుజు, పచ్చని పొలాలు, చెరువులు చిత్రీకరణకు అనుకూలంగా ఉన్నాయి. 'గద్దలకొండ గణేష్', 'కింగ్‌డమ్‌' వంటి సినిమాలు ఇక్కడ 20 రోజుల పాటు చిత్రీకరించారు. రాజీవ్‌ కనకాల నటించిన 'హోంటౌన్‌' వెబ్‌ సీరిస్‌ 90 శాతం ఇక్కడే పూర్తయింది.