VIDEO: ఫేస్ స్కాన్ ఫెయిల్.. కూలీలకు నష్టం

VIDEO: ఫేస్ స్కాన్ ఫెయిల్.. కూలీలకు నష్టం

MDK: రేగోడ్ మండలం మర్పల్లిలో సోమవారం ఉపాధి హామీ పనుల్లో సాంకేతిక లోపం కూలీలను ఇబ్బందులకు గురిచేసింది. ఫేస్ ఆథెంటికేషన్ హాజరు వ్యవస్థ పనిచేయకపోవడంతో కూలీలు పనిస్థలానికి వెళ్లి నిరాశతో వెనుదిరిగారు. రోజువారీ కూలిపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా పనిదినాలు వృథా అవుతున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.