ఐనవోలు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఘన విజయం
HNK: ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం మధు వంశీ గౌడ్ 300 ఓట్ల భారీ మెజార్టీతో ఆదివారం ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో గ్రామంలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పార్టీ జెండాలతో సంబరాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.