అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
ATP: పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామ్మోహన్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 ఆంధ్ర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అక్రమంగా మద్యం నిలువ ఉంచిన విక్రయించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.