'ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం'
మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STUTS) ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు.