అరటి తోటను ధ్వంసం చేసిన అడవి పందులు
NDL: మహానంది మండలం ఆంజనేయపురం గ్రామ సమీపంలో రైతు పెద్ద పుల్లయ్య పొలంలోని అరటి తోటను అడవి పందులు నాశనం చేసినట్లు వాపోయాడు. ఆదివారం చలమ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మద్దిలేటి స్వామి పంట పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి పందులే దాడి చేసినట్లు నిర్ధారించామన్నారు. ఉన్నత అధికారులకు నివేదికలు పంపుతామని ఆయన చెప్పారు.