ఇంటి స్థలం విషయమై ఘర్షణ.. కేసు నమోదు

KDP: ఇంటి స్థల విషయమై ఘర్షణ పడిన ఘటన కాశినాయన మండలంలోని సావిసెట్టిపల్లెలో జరిగింది. గ్రామంలో తన ఇంటి స్థలాన్ని కొలతలు వేయాలని పోలయ్య రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బుధవారం అధికారులు కొలతలు వేసేందుకు గ్రామానికి రాగా సత్యరాజు మరికొందరు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. ఇరవర్గాలపై కేసు నమోదు చేశామని ఎస్సై యోగేంద్ర తెలిపారు.