ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి: వేగుళ్ల
కోనసీమ: కపిలేశ్వరపురం ఎంపీపీ సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హాజరయ్యారు. ఇందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరారు.