మాజీ సర్పంచ్‌పై దాడి
ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రస్తుత జనసేన నాయకుడు నాగరాజుపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. దాడిలో గాయపడి కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుని కొండపి జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు.