VIDEO: ప్రజావాణికి 40 ఫిర్యాదులు
WNP: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు.