ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం విశేష పూజలు అందుకుంది. ఉదయపూర్వమే అర్చకులు అమ్మవారి మూల విగ్రహాన్ని క్షీరాలతో పాటుసుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, పసుపు, గంధం, కాటుక, వెండి, ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు మారెమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.