భారీ కొండచిలువ హతం

ASR: భారీ వర్షాలకు ఓ భారీ కొండచిలువ శుక్రవారం రాత్రి రావణాపల్లి పంచాయతీ తోటలూరు గ్రామంలోకి చొరబడింది. దీన్ని గుర్తించిన గ్రామస్థులు నిలువరించేందుకు ప్రయత్నించారు. దీంతో కొండచిలువ పరారైంది. తిరిగి శనివారం రావణాపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో, 516-ఈ జాతీయ రహదారి పక్కన కనిపించింది. గమనించిన స్థానికులు ప్రాణభయంతో ఆ పామును హతమార్చారు.