'లాభాల్లో వాటా అక్కు సాధించిన మహానేత కేల్ మహేంద్ర'

PDPL: సింగరేణి సంస్థ లాభాల్లో వాటా హక్కు సాధించిన మహా నేత KL మహేంద్ర కృషి మరువలేనిదని AITUC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గోదావరిఖని భాస్కరరావు భవన్‌లో ఆయన 18వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చివరి శ్వాస వరకు కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కృషి చేశారని గుర్తు చేశారు.