ఎన్నికల్లో యువత సత్తా.. సర్పంచ్‌లుగా గెలిచిన యువతులు
KMR: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత తమ సత్తాను చాటుకుంది. ఎల్లారెడ్డి మండలానికి చెందిన కల్యాణి గ్రామ సర్పంచ్‌గా MBA విద్యార్థిని నవ్య (22) 901 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. అలాగే మల్కాపూర్ గ్రామ సర్పంచ్‌గా డిగ్రీ విద్యార్థిని యోగిత గెలుపొందింది. ఇద్దరు యువతులు గ్రామ సర్పంచ్‌లుగా గెలుపొందడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.