దయాకర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు

NLG: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి తన జీతంలో నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై... ఆయన పనితనంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.