ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న MLA

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న MLA

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలకు సిర్పూర్ MLA హరీష్ బాబు హాజరయ్యారు. అయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్యసేవలు మెరుగు పడుతున్నాయని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రిని శరవేగంగా పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.