చిలకలూరిపేట-నకరికల్లు హైవే విస్తరణ

చిలకలూరిపేట-నకరికల్లు హైవే విస్తరణ

PLD: జాతీయ రహదారి-167A విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిలకలూరిపేట-నకరికల్లు మధ్య దీనిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన వృద్ధి ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థకు కేంద్ర రవాణా శాఖ ఎల్‌వోఏ జారీ చేసింది. రూ.313.15 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సమాచారం.