VIDEO: మహబూబాబాద్‌లో యూరియా కోసం రైతుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు.