'జిల్లాలో TGSRTC ద్వారా రాఖీలు పంపే సదుపాయం'

KMM: రాఖీ పండుగ సందర్భంగా దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీలు పంపడానికి TGSRTC కార్గో ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ సేవలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని బస్టాండ్‌లలో, అధీకృత RTC కార్గో ఏజెంట్ల ద్వారా పొందవచ్చని ఖమ్మం ఏటీఎం కె. వెంకటనారాయణ తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.