రేపటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు
CTR: పుంగనూరు బజారువీధిలోని శ్రీ కోదండ రాములవారి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్వామివారి మూలవర్లకు అభిషేకాలు చేశారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ఆవరణలో 28న కూచిపూడి, భరతనాట్యం, 29న భగవద్గీత పారాయణం, 30న రామదాసు, అన్నమయ్య కీర్తనలు, 31న సీతారాముల కళ్యాణం జరుగుతుందన్నారు.