మాజీ డీజీపీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన మాజీ డీజీపీ హెచ్. జె.దొర సంస్మరణ సభలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొర చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని నివాళులర్పించారు. దొర సేవలను గుర్తు చేసుకుంటూ సభను నిర్వహించారు.