విజయవాడలో వ్యభిచార ముఠా ఆగడాలు
ఎన్టీఆర్: బెంజ్ సర్కిల్ పరిసరాల్లో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. గుణదలకు చెందిన ఓ వ్యక్తి పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఓ మహిళతో ఒప్పందం కుదుర్చుకొని తన ఇంటికి తీసుకురాగా, అప్పటికే ప్లాన్ వేసిన మరో ఇద్దరు లోపలికి చొరబడ్డారు. అతణ్ని బెదిరించి ఇంట్లోని బంగారం, బట్టలు దోచుకెళ్లారు. బాధితుడు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.