మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
CTR: పులిచెర్ల మండలం ఎల్లంకి వారిపల్లిలో మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడు మోహన్‌ను అరెస్ట్ చేసినట్లు కల్లూరు సీఐ జయరామయ్య తెలిపారు. ఇందులో భాగంగా కళావతి ఇంట్లో బంగారం దొంగతనం చేసే ప్రయత్నంలో అడ్డొచ్చిన విమలమ్మను హత్య చేసి పరారయ్యాడు. దీంతో అతన్ని పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.