3718 సంఘాలకు రూ. 3.99 కోట్ల వడ్డీ లేని రుణాలు
SDPT: ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. గజ్వేల్ ఐఓసీలో 3718 స్వయం సహాయక సంఘాలకు రూ. 3.99 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ చీరలు ధరించి వచ్చిన మహిళలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్డీవో చంద్రకళ, అడిషనల్ డిఆర్డిఓ సుధీర్, సమాఖ్య అధ్యక్షులు రేణుక పాల్గొన్నారు.