VIDEO: రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు వాసులు మృతి
KDP: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.పెంచలకోనలో జరిగే పెళ్లికి ప్రొద్దుటూరు నుంచి 8 మంది ఓ కారులో బయల్దేరారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.