'జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు'
AP: మత్స్యకారులకు అన్యాయం జరిగితే తొలుత మాట్లాడే వ్యక్తి తానేనని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదన్నారు. నేలటూరు జెట్టీని పూర్తి చేయించే బాధ్యత తనదని తెలిపారు. 3 నెలల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమ తీరప్రాంతానికి ద్రోహం చేసింది వైఎస్‌ఆర్ కుటుంబమేనని ఆరోపించారు.