శ్రీ వీరబాబు గుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే
VZM: లక్కవరపుకోట మండలం రంగరాయపురం గ్రామంలో గల శ్రీ వీరబాబు గుడిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్బంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆమె పాల్గొని, భక్తులకు ప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.