పార్కు ప్రహరీ గోడను ప్రారంభించిన కోటంరెడ్డి

NLR: రూరల్ పరిధిలోని 28వ డివిజన్ చైతన్యపురి పార్కులో రూ. 21 లక్షల నిధులతో నిర్మించిన ప్రహరీ గోడను బుధవారం రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రిజర్వు, పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు.