'ఐఐఎస్టీ సంస్థ నిర్మాణ పనులకు నిధులు మంజూరు'
కాకినాడ: యు.కొత్తపల్లి ( M) పొన్నాడలో నిర్మిస్తున్న ఐఐఎస్టీకి కేంద్ర ప్రభుత్వం రూ.28.43 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం రూ.229.81 కోట్ల వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు సగం చొప్పున భరించాల్సి ఉందని, Dy. Cm పవన్ చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో సంస్థ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికానున్నాయని పేర్కొన్నారు.