ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త సినిమా టీజర్
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగమన్'. మనీష్ సైనీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సరికొత్త కామెడీ ఫాంటసీగా రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక 'శివ కా ఇన్సాఫ్'(1985) తర్వాత అంటే దాదాపు 40 తర్వాత జాకీ మళ్లీ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు.