'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

WNP: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు ఆదేశించారు. ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి దోమలే కారణమని ఆ దోమలు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.