జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేట్ ఎదుట అఖిల భారత రైతు సమాఖ్య ఏఐకెఎఫ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వెంటనే రైతు లకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవికి వినతిపత్రాన్ని అందజేశారు.