ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ASR: కొయ్యూరు మండలం ఎం.మాకవరం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ చింతల్లి రాజుబాబు, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు మోహన్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, వీహెచ్ఏ ఎం.సంధ్యారాణి తదితరులు రిబ్బన్ కట్ చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. తాము పండించిన ధాన్యాన్ని ఆర్ఎస్కేల ద్వారా విక్రయించాలని రైతులను కోరారు.