మదనపల్లెకి యోగా గురు రాందేవ్ బాబా రాక..!

మదనపల్లెకి యోగా గురు రాందేవ్ బాబా రాక..!

అన్నమయ్య: మదనపల్లెకు మరికొంత సేపట్లో యోగా గురు రాందేవ్ బాబా రానున్న నేపథ్యంలో DSP మహేంద్ర ఆదేశాలతో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వాహనంతో పాటు పలు వీఐపీలు, అధికారుల వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక బీటెక్ కళాశాల గ్రౌండ్‌లో హెలిపాడ్ వద్దకు పోలీసులు, స్థానికంగా ఉన్న పతంజలి ట్రస్ట్ సిబ్బంది చేరుకున్నారు.