VIDEO: పందికి పాలిచ్చిన కుక్క

KRNL: రోడ్డుపై పంది పిల్లలు కనిపిస్తే తరిమే కుక్కలను చూసి ఉంటాం. కానీ కౌతాళం మండలంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం ఉదయం శునకం జాతి వైరం మరచి పందికి పాలిచ్చింది. మనిషికి మనిషి తోడు ఉండని నేటి సమాజంలో జాతి వైరం మరిచి పందికి పాలు ఇవ్వడం అరుదు అని స్థానికులు తెలిపారు. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యకరంగా తిలకించారు.