బెల్లంకొండలో నూతన అంగన్వాడి భవనం ప్రారంభం
PLD: బెల్లంకొండ-3లో నూతన అంగన్వాడి భవనాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం ప్రారంభించారు. మన బడి-మన భవిష్యత్తు పథకం కింద రూ.16 లక్షల నిధులతో ఈ భవనం నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందన్నారు.