'మల్యాలను ఎస్సీ రిజర్వేషన్ చేయాలి'

JGL: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుందన్న వార్తలతో ఆయా గ్రామాల్లో ఓట్ల సందడి నెలకొంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు అప్పుడే ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం తమ ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కొందరు రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. మల్యాల మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఎస్సీ రిజర్వేషన్ కాలేదని మాజీ వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శనిగారపు తిరుపతి కోరారు.