'పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చెయ్యాలి'

PPM: పార్వతీపురం మండలం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి లంచ్ విరామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో APTF జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డీఏలు, నూతన పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్ల కొరకు నిరసన చేపట్టామని తెలియజేశారు.