ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

WGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డ ఘటన వర్ధన్నపేట మండలం కొత్తపల్లి ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై చందర్ వివరాల ప్రకారం.. బచ్చల స్వామి (38) వృత్తి రీత్యా డ్రైవర్ గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో చేసినట్లు తెలిపారు.