అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించిన కలెక్టర్

MDK: చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యుత్ దీపాలు, త్రాగునీటి సౌకర్యం, సుందరీకరణ పనులను నిర్వహిస్తున్నారు. 60% మేరా పనులు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. పనులు వేగాంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు.