చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య
TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఓ వివాహిత చీమల ఫోబియాతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శర్వా హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా అనే వివాహిత చీమల ఫోబియాతో బాధపడుతోంది. అయితే మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లిన అనంతరం ఆమె.. 'ఈ చీమల ఫోబియాతో బతకడం నా వల్ల కావట్లేదు.. మన బిడ్డ జాగ్రత్త' అని లెటర్ రాసి ఉరేసుకుని చనిపోయింది.