'దివ్యాస్త్ర MK2'.. స్వదేశీ అస్త్రం సిద్ధం
లక్నోకు చెందిన 'హవర్ ఇట్'(HoverIt) సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'దివ్యాస్త్ర MK2' లోయిటరింగ్ మ్యూనిషన్ హై-స్పీడ్ టాక్సీ ట్రయల్స్(HSTT)ను విజయవంతంగా నిర్వహించింది. సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఈ అస్త్రం భారత రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.