అదానీ, పొల్యూషన్, SIR.. పార్లమెంట్‌లో రచ్చ తప్పదా?
పార్లమెంట్ వింటర్ సెషన్స్‌కు రంగం సిద్ధమైంది. రేపు అఖిలపక్ష భేటీ జరగనుండగా.. విపక్షాలు మాత్రం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈసారి సమావేశాల్లో అదానీ వ్యవహారం, ఢిల్లీ పొల్యూషన్, SIR అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం మాత్రం కీలక బిల్లుల ఆమోదంపైనే దృష్టి పెట్టింది. దీంతో సభలో ఈసారి వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.