భార్య సర్పంచ్‌, భర్త ఉప సర్పంచ్‌

భార్య సర్పంచ్‌, భర్త ఉప సర్పంచ్‌

KMM: బోనకల్‌ పంచాయతీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్‌గా 932 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి మంగమ్మపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి జనరల్‌ మహిళా రిజర్వేషన్‌తో సతీమణిని బరిలో నిలిపి సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు.