విభిన్న ప్రతిభావంతుల గృహాన్ని సందర్శించిన జడ్జి

విభిన్న ప్రతిభావంతుల గృహాన్ని సందర్శించిన జడ్జి

ఏలూరులో విన్సెంట్ డిపాల్ విభిన్న ప్రతిభావంతుల గృహాన్ని జిల్లా జడ్జి రత్న ప్రసాద్ గురువారం సందర్శించారు. అక్కడ నివసిస్తున్న వారికి అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. గుర్తింపు కార్డులు లేక సంక్షేమ పథకాలు అందడంలో జాప్యం జరుగుతోందని నిర్వాహకులు తెలపగా.. వెంటనే లీగల్ పారా వాలంటీర్లను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.