రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమిలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బరోడా బ్యాంక్ వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న పోతుగుంట్ల ఉమామహేశ్వరరావును రాయపూడి వైపు నుంచి వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమామహేశ్వరరావు కాలు విరగడంతో, స్థానికులు ఆయనను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.