'పదవి విరమణ సహజం, సేవలు శాశ్వతం'
MDK: పదవి విరమణ సహజమని, సేవలు శాశ్వతమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసరావు తమ జీవిత కాలాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు. ఏడీ శ్రీనివాసరావు పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సన్మానించారు. ఉద్యోగ నిర్వహణలో పదవి విరమణ సహజమని, వారు అందించిన నిస్వార్థ సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.