VIDEO: 'అంగన్వాడీ భవనాలకు మరిన్ని నిధులు ఇవ్వాలి'
VSP: అసెంబ్లీలో గురువారం అంగన్వాడీ సెంటర్ల పరిస్థితిపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రస్తావించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2684 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 1100 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయని, 852 అద్దె భవనాల్లో, 732 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. కొన్ని సెంటర్లలో టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు కూడా లేవన్నారు.